వైఎస్సార్ కడప జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా బాధ్యతలు స్వీకరించిన చింతామణిని ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ యూనియన్ (AIBSU) రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.