కడప: విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు మృతి

కడప నగర శివారులోని ఫాతిమా మెడికల్ కళాశాలలో విద్యుత్ షాక్ తో రామరాజుపల్లె భవన నిర్మాణ కార్మికుడు ఓబులేసు శుక్రవారం మృతి చెందాడు. మృతుడు ఐదు సంవత్సరాలుగా ఫాతిమా మెడికల్ కళాశాలలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే కూలీకి వెళ్లిన మృతుడు శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్