కడపలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

వైఎస్సార్‌ కడప జిల్లాలో మంగళవారం ఎలాంటి ఆర్భాటాలు, శబ్దాలు, డాన్సులు లేకుండా ఎంతో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరిగింది. పల్లెలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా పాల్గొన్నారు. జంతువులకు, మనసులకు ఎలాంటి హాని కలగకుండా ఈ వేడుకను చక్కగా జరుపుకున్నారు. భజన కార్యక్రమాల మధ్య జరిగిన ఈ నిమజ్జనం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గణపతి పప్ప మోరియా అంటూ కేరింతలు కొడుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕