హెల్మెట్ ధరించని వారికి ఎస్పీ హెచ్చరిక: రూ. 32 వేల జరిమానా

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 99 మందిపై కేసులు నమోదు చేసి, రూ. 32,075 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్ బెల్ట్ వాడాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్