టీడీపీ కార్యకర్త పాలెం రాయుడు ప్రమాదవశాత్తు మరణించడంపై కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించి, పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.