పెన్నానదిలో యువకుడి గల్లంతు

సిద్ధవటం మండలం లింగంపల్లె శివారులోని పెన్నానదిలో ఈతకు వెళ్లి వంగర జగదీష్ కుమార్ (26) అనే యువకుడు ఆదివారం గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన జగదీష్, కడపలో ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా భోజనం చేసిన తర్వాత నదిలో ఈతకు దిగిన అతడు అకస్మాత్తుగా మునిగిపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్