పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను NSS యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.