జాతీయ సేవా పథకం స్థాపన దినోత్సవం ప్రభుత్వ జూనియర్ కళాశాల పోరుమామిళ్లలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సేవాభావం పెంపొందించుకొని తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కళాశాల వైస్ ప్రిన్సిపల్ L. చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందజేయడం జరిగింది.