కాజీపేట పట్టణంలో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జయరాం మాదిగ, మరియన్న మాదిగ, కడప జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు విజయభాస్కర్ మాదిగ, టిడిపి నాయకులు లక్ష్మీరెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటరమణ, మండల అధ్యక్షులు కర్ణ, నారయణ తదితరులు పాల్గొన్నారు.