మైదుకూరు మండలం వనిపెట అటవీ రేంజ్ పరిధిలోని అడవిలోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖాధికారులు, వనిపెంట అటవీ క్షేత్రాధికారి జె. ప్రజేత్ రావు ఉత్తర్వుల మేరకు రేంజ్ సిబ్బంది శుక్రవారం అడవిలో కూంబింగ్ నిర్వహించారు. కొంతమంది ఎర్రచందనం చెట్లను నరుకుతూ కనిపించారు. వారిలో ముగ్గురిని అటవీ సిబ్బంది పట్టుకొన్నారు. అక్కడ దొరికిన 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.