వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పెన్నా నది కాలుష్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న బీజేపీ ఆధ్వర్యంలో మానవహారం, ధర్నా నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు బీజేపీ అర్బన్ 2 అధ్యక్షుడు పాలెంరెడ్డి కిరణ్ మంగళవారం తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినా అధికారులు పట్టించుకోవడం లేదని, కూటమిలో భాగంగానే ఉన్నామని వారు గుర్తు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై కేంద్రమంత్రిని కలిసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్ తరాల కోసం పెన్నా నదిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.