ప్రొద్దుటూరులో ఎస్ఐపై వరకట్న కేసు నమోదు

నంద్యాలలో ఫింగర్ ప్రింట్ ఎస్సైగా పనిచేస్తున్న ఇండ్ల భరత్ కుమార్పై సోమవారం ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్లో వరకట్నపు కేసు నమోదైంది. భరత్ కుమార్ 2025లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం భార్యను కాపురానికి పిలుచుకు వెళ్లకుండా వేధించసాగాడు. బాధితురాలు స్థానిక ఏఎస్పీ విభుకృష్ణను ఆశ్రయించగా, 1-టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్