ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.