ప్రొద్దుటూరులో అంగన్వాడీలకు సన్మానం.. మోడీ చిత్రపటం అందజేత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ నిర్వహించే సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు అంగన్వాడీ కేంద్రాలను శనివారం సందర్శించారు. టీచర్లు, ఆయాల సేవలను ప్రశంసిస్తూ వారిని శాలువాలతో సన్మానించారు. గర్భిణీలు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశంసించారు. మోడంపల్లి అంగన్వాడి సెంటర్‌లో మోడీ చిత్రపటాన్ని కూడా అందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕