రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

పెద్దముడియం మండలంలోని పాలూరు గ్రామం వద్ద సోమవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్