లింగాల: కోన మల్లేశ్వర స్వామి ఆలయం లో పోటెత్తిన భక్తులు

లింగాల మండలంలోని పార్నపల్లి సమీపంలో ఉన్న అతి పురాతన కోనమల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు స్నానమాచరించి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం 'హర హర మహాదేవా' నినాదాలతో మార్మోగింది. మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్