తొండూరు: తుపాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రెండు రోజులపాటు తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ రామచంద్రుడు సూచించారు. తుపాన్ సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధులు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. అత్యవసరమైతే 7674950741 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్