వేంపల్లి: రైతుల ముఖాల్లో దీపావళి కాంతులు కనిపించడం లేదు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి సోమవారం వేంపల్లెలో మాట్లాడుతూ, ప్రస్తుతం రైతు రాజ్యం లేదని, రైతు దేశానికి వెన్నెముక అని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని, కూటమి పాలనలో రైతు ప్రతిరోజు ఏడుస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ముఖాల్లో దీపావళి కాంతులు, వెలుగులు, పండుగ సంతోషం, పండుగ వాతావరణం ఏ మాత్రం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్