వేంపల్లి: నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

వేంపల్లెలో పాపాగ్ని నదికి వరద నీరు వస్తుండటంతో, నదిలోకి పిల్లలు, పెద్దలు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పులివెందుల సమన్వయకర్త మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి కోరారు. సోమవారం వేంపల్లె పోలీసుస్టేషన్ లో పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. పాపాగ్ని నదిలో గుంతలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్