రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి ఆరోపించారు. శనివారం వేంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కడప జిల్లాలో రబీలో రెండు లక్షల ఎకరాలలో శనగ పంటకు 60 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని, అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా సరఫరా చేయలేదని వ్యవసాయ శాఖపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ శాఖ కుంభకర్ణునిలా నిద్రపోతోందని ధ్వజమెత్తారు.