AP: నర్సరావుపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. పోలీసులు భద్రత కల్పిస్తామని మాట తప్పారని, నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు దాడులకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, తమ పార్టీ అభ్యర్థుల భద్రతను పణంగా పెట్టి నామినేషన్లకు పంపలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత పేర్కొన్నారు.