AP: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరు చోటుచేసుకుంది. 25వ వార్డులో జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి బీసపు హైమావిజయలక్ష్మి 419 ఓట్లు సాధించి, కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి 418 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నోటాకు 8 ఓట్లు పడడం విశేషం. ఫలితాల అనంతరం రీకౌంటింగ్ చేపట్టినప్పటికీ, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదని వైసీపీ అభ్యర్థే గెలుపొందారని అధికారులు ప్రకటించారు.