AP: తునిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తమ సత్తా చాటారు. మొత్తం మూడు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి వార్డు నుంచి మంగాదేవి, రెండో వార్డు నుంచి చింతల సునీత, 8వ వార్డు నుంచి విజయదుర్గ విజయం సాధించినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ గెలుపుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నియోజకవర్గంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక రాజకీయాల్లో ఈ ఫలితాలు పార్టీకి కొత్త ఊపును ఇస్తున్నాయి.