AP: ఏపీలో స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్ సీపీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త అండగా నిలవాలని, నాయకుడు తమ వెంట ఉన్నాడని ప్రతి అభ్యర్థికి అనిపించేలా చూడాలని ఆయన సూచించారు.