రానున్న రోజుల్లో వైసీపీకి భవిష్యత్‌ లేదు: సీఎం చంద్రబాబు

AP: రానున్న రోజుల్లో వైసీపీకి భవిష్యత్ లేదని, వారి పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని, విభజన కంటే వైసీపీ పాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని అన్నారు. తనను 53 రోజుల పాటు నోటీసు లేకుండా జైల్లో ఉంచారని, పవన్ కల్యాణ్‌ను కూడా వేధించారని తెలిపారు. కూటమిగా ఏర్పడి చీకటి పాలనకు చరమగీతం పాడామని, ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారంటే కూటమి చలవేనని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్