ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఇప్పటికే రాజకీయంగా కనుమరుగైందని, వైసీపీ ఒక చనిపోయిన పార్టీ అంటూ పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులు ఇంకా భ్రమల్లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీతో తమకు ఎలాంటి పోటీ లేదని, ఆ పార్టీని ప్రజలు గత ఎన్నికల్లోనే తిరస్కరించారని స్పష్టం చేశారు.