అమరావతికి, రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి ఎప్పుడూ వైసీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి రూ. రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే ఎకరానికి రూ. 2 కోట్లు అవుతుందని, లక్ష ఎకరాలకు రూ. 2 లక్షల కోట్లు కావాలని, ఈ మొత్తం ఇంకా పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమన్నారు. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని అన్నారు.