AP: టీడీపీ దాడులకు నిరసనగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమంలో చెవిరెడ్డి లక్ష్మి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ వద్ద ఈ శాంతియుత నిరసన జరుగుతుండగా, వారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.