AP: రాష్ట్రంలో సంచలనం రేపిన జనసేన రాష్ట్ర నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్య కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత నరేంద్ర రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. జనసేన నేతను హతమార్చేందుకు రౌడీ షీటర్లతో కుట్ర పన్ని సుపారీ ఇచ్చారనే ఆరోపణలపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న నరేంద్ర రెడ్డిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతన్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఇదే కేసులో సుపారీ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ వెంకటేశ్ ఇప్పటికే లొంగిపోయాడు.