AP: పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లిలో వైసీపీ నేత రవీంద్రారెడ్డిపై ప్రత్యర్థులు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. రవీంద్రారెడ్డి కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నారనే కారణంతో మంత్రి సవిత అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ భర్త చరణ్ రెడ్డి అతడిని పరామర్శించారు.