AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ అరెస్టును వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. విజయవాడ బీసీ సంక్షేమ భవన్లో మంత్రి సవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ..'కల్తీ మద్యం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని మంత్రి అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జోగి రమేశ్ కోరడం హాస్యాస్పదమన్నారు. బాబాయి గొడ్డలి పోటు కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎందుకు కోరడం లేదు' అని ఆమె ప్రశ్నించారు.