AP: అనకాపల్లిలో కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన 100 కోట్ల విలువైన భూమి కబ్జాపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సనాతన ధర్మం పేరుతో భూములు కబ్జా చేస్తున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముత్యాల నాయుడు, మలసాల భరత్, కరణం ధర్మశ్రీ కూడా అధికారుల కుమ్మక్కుతో దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయని, ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలని వారు కోరారు.