AP: వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్‌కు విద్య, మద్యం విషయాల్లో మాట్లాడే అర్హత లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ,“గురువులను మద్యం దుకాణాలకు కాపలాగా పెట్టి అవమానించారు. విద్యార్థుల చదువులు దెబ్బతీశారు.విషపూరిత మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డా ప్రజలెవరూ మరిచిపోలేదు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇప్పటికీ వారికి బుద్ధిరాలేదు,” అని తీవ్రంగా విమర్శించారు.