AP: గుంటూరు జిల్లా, మంగళగిరిలోని విద్యా భవన్‌లో DSC-2025 వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ప్రశ్నాపత్రం అప్‌లోడ్ చేసిన ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఇది క్రిమినల్ నేరమని వారు ఆరోపించారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులను నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే, అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదని తెలిపారు.