వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌

AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి గుంటూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. వెంగళాయపాలెంలో పోలింగ్‌ అనంతరం చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో నల్లపాడు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. పోలింగ్‌ తర్వాత బ్యాలెట్‌ బాక్సును తరలించేందుకు వచ్చిన ఎన్నికల సిబ్బందిని అప్పిరెడ్డితో పాటు వైసీపీ నేతలు అడ్డుకోవడంతో గుంటూరు-నల్లపాడు మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించి ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕