టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు

AP: ఇటీవల పలువురు వైసీపీ నేతలు TDP, జనసేనలో చేరి ఆ పార్టీకి షాకించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెంలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల ఎంపీపీలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్