ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోత.. వైసీపీ ఎంపీల ఆరోపణలు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగినన్ని నిధులు కేటాయించలేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గించడంతో పాటు, ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సడక్ యోజన పథకాలకు నిధులు తగ్గించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారని, ఇది రాష్ట్రాలపై భారం మోపుతుందని రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్