శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వర్గాల్లో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌పై అసంతృప్తి పెరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా మాట్లాడిన ఆయన, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా చురుగ్గా వ్యవహరించడం లేదని కేడర్ విమర్శిస్తోంది. వంశధార–నాగావళి నదుల దోపిడీ, గ్రావెల్ మాఫియా, రైతు సమస్యలపై స్పందన లేదని, అధికార పక్షాన్ని విమర్శించకపోవడం తమకు అసహనం కలిగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.