వచ్చే ఎన్నికల్లో వైసీపీ 0 సీట్లకు పడిపోతుంది: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి, రైతుల సమస్యలపై జగన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం జగన్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇలాగే వ్యవహరిస్తే, గతంలో వచ్చిన 11 సీట్లు కాస్తా వచ్చే ఎన్నికల్లో సున్నా (0)కి పడిపోతాయని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్