AP: వైసీపీపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనా 40 శాతం ఓటు షేర్ ఉన్న వైసీపీకి, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అరాచక పాలనను ప్రజలు మరచిపోలేదని, జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులను టీడీపీ కూటమే గెలుచుకుంటుందని, మేయర్ సీటును బంపర్ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షాలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, ప్రచారం చేసుకోనీయకుండా కట్టడి చేసిందని విమర్శించారు.