AP: శ్రీకాకుళం జిల్లాలోని మునగపాక ఎంపీపీ ఎన్నికలో జనసేనకు షాక్ తగిలింది. ఈ ఎంపీపీ ఎన్నికలో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది. గత ఎంపీపీ జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో ఆమెపై వైఎస్ఆర్సిపి అవిశ్వాసం పెట్టింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎంపీపీతో పాటు రెండు వైస్ ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. ఎంపీపీగా మొల్లేటి కృష్ణవేణి, వైస్ ఎంపీపీలుగా మళ్ల కాశీ సురేష్, కర్రీ సంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.