AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హింస జరిగాయని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరులో వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన ఓటర్ జాబితాపై అప్రమత్తంగా ఉండాలని, కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలని కోరారు. అమరావతి నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతూనే, అసెంబ్లీలో తీర్మానం చేయడం 'డైవర్షన్ పాలిటిక్స్' అని విమర్శించారు.