AP: మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న బొత్స సత్యనారాయణ పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో, వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన విశాఖ పర్యటనకు వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. బొత్స సత్యనారాయణ కనిపించకపోవడంతో, ఆయనకు ప్రత్యామ్నాయంగా వైవీ సుబ్బారెడ్డిని జగన్ రంగంలోకి దించారని ప్రచారం మొదలైంది.