AP: గుడివాడలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ కార్యక్రమానికి హాజరవుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన నేతలు దాడి చేశారు. ఆ ఘటనపై గుడివాడ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. “కారు దిగండి.. లేకపోతే చంపేస్తాం.. నరికేస్తాం” అంటూ బెదిరింపులు చేశారని, బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి ప్రాణభయంతో కారులోనే గంటల పాటు ఉండాల్సి వచ్చిందని తెలిపారు. నిందితులను జైల్లో పెట్టాలని ఆమె పోలీసులను కోరారు.