TG: ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్య కారులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు 10 మంది SDRF సిబ్బంది రెండు బోట్లపై వెళ్లారు. అయితే ఈ బోట్లు చెరువులో తిరగబడటంతో వారు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.