ఐదుగురికి ప్రాణం పోసిన 10నెలల పసికందు

కేరళలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన అలిన్ షెరిన్ (10 నెలలు) ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ తల్లిదండ్రుల నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్