2024 నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడగా.. నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా, ఈ అల్లర్లలో పాల్గొన్న మరో 10 మందిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వీరిలో ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.