శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 60 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి 31 మధ్య ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఎంటంటే. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు నడవనున్నాయి. అలాగే రేపటి నుంచే ఈ సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.