పడవ మునక.. 10 మంది మృతి

ఇటలీ లాంపెడుసా ద్వీపం సమీపంలో సగంవరకూ మునిగిన చెక్క పడవలో 10 మంది అనుమానిత వలసదారుల మృతిదేహాల్ని వెలికితీసినట్టు జర్మనీకి చెందిన సహాయక సిబ్బంది తెలిపారు. సహాయక చర్యల్లో ఇటలీ తీర గస్తీ దళం కూడా పాల్గొంది. ‘ప్రస్తుతం 51 మందిని రక్షించాం. సకాలంలో చేరలేకపోవడంతో పది మందిని మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయాం’ అని ట్విట్టర్ వేదికగా జర్మనీ నౌక సిబ్బంది తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్