ప్రముఖ ఆడియో స్టోరీటెల్లింగ్ యాప్ పాకెట్ ఎఫ్‌ఎం దాదాపు 100-130 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. తొలగింపులు ప్రధానంగా కంటెంట్ టీమ్‌లో జరిగినట్లు తెలిసింది. జూలై చివరినాటికి మరో 15 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో యాప్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్వెస్ కార్ప్ పేరోల్ కిందకు బదిలీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.